Mahaa Daily Exclusive

  అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచాలి: సీఎం రేవంత్ రెడ్డి

Share

అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా పరిశ్రమను ఉంచడమే తన ధ్యేయమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సినిమా పరిశ్రమలో పని వాతావరణం బాగుండాలని, త్వరలో సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతానని చెప్పారు. కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని, నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి ఒక పాలసీ తీసుకువస్తే బాగుంటుందని అన్నారు.