Mahaa Daily Exclusive

  సరైన సమయంలో రాజకీయాల్లోకి వస్తా: నారా రోహిత్‌

Share

AP: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందిస్తోందని నటుడు నారా రోహిత్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ ఆడియో లీక్‌ వ్యవహారం గురించి తనకు తెలియదని నారా రోహిత్ స్పష్టం చేశారు. తానూ పొలిటికల్ ఫ్యామిలీ నుంచే వచ్చానని.. సరైన సమయంలో రాజకీయాల్లోకి వస్తానని నారా రోహిత్‌ వెల్లడించారు.