Mahaa Daily Exclusive

  తల్లాడలో ఘనంగా కాంగ్రెస్ నాయకులు రాయల రాము జన్మదిన వేడుకలు.. ..!

Share

తల్లాడ, ఆగస్టు, 27, (మహా )
కాంగ్రెస్ పార్టీ నాయకులు రాయల రాము జన్మదిన వేడుకలు బుధవారం తల్లాడ మండలంలో ఘనంగా నిర్వహించారు. తల్లాడ పట్టణంలోని కల్లూరు రోడ్డు, వెలుగు కార్యాలయం సమీపంలోని పీర్ల సావిడి వద్ద, శివాలయం వద్ద వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన్మదిన వేడుకల కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరై ఆయనకు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ రాయల రాము ఇటువంటి వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి ఉన్నత పదవులను అధిరోహించాలని ఆకాంక్షించారు. తొలుత తల్లాడ పట్టణంలో టపాసులు పేల్చారు. అనంతరం తల్లాడలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కల హరీష్ రెడ్డి, అయినాల నరసింహారావు, బండి బాలసౌరి, దగ్గుల శ్రీనివాసరెడ్డి, పస్తం రామయ్య, గుజ్జర్లపూడి చింటూ, ధూపాటి నాగరాజు, రావుల గోపి గౌడ్, ఖాన్, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Latest