కూసుమంచి, మహా:
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ చైర్మన్ రాయల నాగేశ్వరరావు అన్నారు.. రాష్ట్రంలో యూరియా కోరతకు, రైతులు ఇబ్బందులు పడటానికి కేంద్ర ప్రభుత్వమే కారణమని తెలిపారు.. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, గత కోన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న పట్టించుకోవడం లేదని అన్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బద్నాం చేయాలని చూస్తుందని ఆరోపించారు.. యూరియా సమస్యను కోందరూ రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు.. ఇలాంటి వారిపట్ల ప్రజలు,రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. రైతుల సమస్యలపై పార్లమెంట్ వేదికగా తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేసినప్పటికీ కూడా కోటా మేరకు యూరియా విడుదల చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు..ఈ సారి ముందస్తు వర్షాలు రావడంతో అన్ని ప్రాంతాల్లోనూ ఒకేసారి అన్ని రకాల పంటలు సాగు అయ్యాయని, దీంతో ఒకేసారి పెద్ద మొత్తంలో యూరియా కావాల్సి వచ్చినప్పుటికి,రాష్ట్ర అవసరాల మేరకు యూరియా సరఫరా చేయకుండా కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని స్పష్టం చేశారు..






