కాటారం, మహా : భూపాలపల్లి జిల్లాలో వినాయక చవితి పండుగను గ్రామీణ ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. తొమ్మిది రోజుల ఉత్సవాలు ప్రతిరోజు పండుగగానే ప్రజలు జరుపుకుంటారు.జిల్లాలో ప్రజలు పండుగ రోజున తలంటు స్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో వినాయక విగ్రహాన్ని ఇళ్లలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ ఏడాది ఎక్కువ గా మట్టితో తయారుచేసిన గణపతి విగ్రహాలకే పూజలు నిర్వహించారు. పాయసం చేసి వినాయకుడికి నైవేద్యం పెట్టిన అనంతరం పాయసాన్ని భక్తులు సేవించారు. గ్రామాల్లో నవరాత్రి ఉత్సవాలు జరిపే మండపాలను ప్రత్యేకంగా రంగు రంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. బుధవారం ఏకధాటిగా వర్షం పడడంతో విగ్రహాల ఆగమనానికి ఊరేగింపులు లేకుండా పోయాయి. వర్షం తెరిపినిచ్చినప్పుడు హడావుడిగా వాహనాలలో డైరెక్ట్ గా మండపాలకి తీసుకువెళ్లి వినాయకుని విగ్రహాలను ప్రతిష్టించారు. కాలేశ్వరం కోటంచ ఇతర దేవాలయాల్లో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు.
పూజా సామాగ్రి విక్రయాలతో మార్కెట్ బిజీ బిజీ..
వినాయక చవితి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మంగళవారం బుధవారాలు మార్కెట్ లు కిటకిటలాడాయి. వినాయక విగ్రహాలను, వివిధ రకాల పత్రి, పూజకు ఉపయోగించే సామాగ్రి, పూలు, వినాయకునికి ఇష్టమైనటువంటి పండ్ల ను, ఆకులను కొనుగోలు చేశారు.






