TG: హబీబ్‌నగర్‌లో CM రేవంత్ రెడ్డి గెటప్‌లో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని MLA రాజాసింగ్ ఖండించారు. వెంటనే మండపాన్ని తొలగించేలా చర్యలు తీసుకోవాలని HYD సీపీకి ఫిర్యాదు చేస్తూ లేఖ రాశారు. సీఎంపై గౌరవంతో దాన్ని ఏర్పాటు చేసినా ఆయన తమకు దేవుడు కాదన్నారు. హిందూ సమాజం మనోభావాలను దెబ్బతీయొద్దని, మత విశ్వాసాలను గౌరవించాలని కోరారు.
Post Views: 29






