వివిధ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు యువతను మోసం చేస్తున్నారని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. “మయన్మార్‌లో చిక్కుకున్న 41 మంది భారతీయులను విదేశాంగ శాఖ బుధవారం భారత్‌కు తీసుకొచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని అటవీమార్గంలో మయన్మార్‌కు తరలించారు. ఆన్‌లైన్ మోసాలకు పాల్పడేలా వారిపై ఒత్తిడి చేసి, చేయని వారిని చిత్రహింసలకు గురిచేశారు. స్పష్టత లేకుండా యువత ఉద్యోగాలంటూ విదేశాలకు వెళ్లకూడదు.” అని పెమ్మసాని చెప్పారు.
Post Views: 42






