ఆదిలాబాద్ మహా : పంట ,ఇండ్లు నష్టపోయిన బాదితులు ఎవరూ ఆందోళన చెందవద్దని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి అన్నారు. ఆదివారం బేల మండలంలో ఆయన పర్యటించారు. మండలంలోని బెదోడ, కంగార్ పూర్ , మనియార్ పూర్ ,ఖోగ్దూర్, మాంగ్రూడ్ గ్రామాలలోని వరద ప్రభావిత ప్రాంతాలలో తిరిగి రైతులను ప్రజలను ఓదార్చారు. ఇటీవల భారీ వర్షాల ధాటికి దెబ్బ తిన్న పంటపొలాలు రోడ్లు, బ్రిడ్జి లను పరిశీలించారు. బాధిత రైతులను ప్రభుత్వం తప్పకుండ ఆదుకుంటుందని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణ , బేల మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.
Post Views: 20






