Mahaa Daily Exclusive

  లక్ష్మీ బాలాజీ నగర్ లో సిద్ధిబుద్ధి సమేత వినాయకుని కళ్యాణోత్సవం ..!

Share

మంచిర్యాల, మహా : మంచిర్యాల పట్టణంలోని లక్ష్మీ బాలాజీ నగర్ లో గణేష్ మండపంలో ఆదివారం సిద్ధిబుద్ధి సమేత వినాయకుని కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు వైభవంగా నిర్వహించారు. వరుడి తరఫున నూతి కట్ల మార్కండేయులు దంపతులు, వధువు తరఫున సిరిపురం గంగాధర్ దంపతులు ఒకరినొకరు ఎదుర్కొని సాంప్రదాయ పద్ధతిన కార్యక్రమాన్ని నిర్వహించారు.
అనంతరం సిద్ది బుద్ధి సమేత వినాయక విగ్రహాలతో పలు వాడలలో ఊరేగింపు నిర్వహించారు. వేద బ్రాహ్మణ మంత్రోచ్ఛారణల మధ్య సిద్ధిబుద్ధి సమేత వినాయకుని కళ్యాణాన్ని కన్నుల పండుగ నిర్వహించారు.
అనంతరం ఆర్య ప్రాంగణంలో మధుకర్ దంపతుల అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాలనీవాసులు పాల్గొన్నారు.

Latest