మందమర్రి, మహా : సింగరేణి కాలరీస్ కంపెనీ మందమర్రి ఏరియా సింగరేణి గిరిజనుల సంక్షేమ సంఘం అధ్యక్షులుగా రాము నాయక్ ఎన్నికైనట్లు
ఆ సంఘం (7856/2001) కేంద్ర కమిటీ అధ్యక్షులు ధరావత్ పంతుల నాయక్, బెల్లంపల్లి రీజియన్ ఆర్గనైజింగ్ కార్యదర్శి భూక్య పరశురాం, లైజన్ అధికారి గుగులోత్ బాబు జాదవ్ లు
వెల్లడించారు. ఆదివారం స్థానిక సింగరేణి సిఈఆర్ క్లబ్ లో ఆ సంఘం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ నేటి నూతన కమిటీ సింగరేణి సంస్థ ఎదురు నిర్వహిస్తున్న గిరిజనుల హక్కుల సాధన కొరకు పాటుపడాలని అన్నారు. పరిష్కృత సమస్యలను కేంద్ర కమిటీ దృష్టికి తీసుకువచ్చి వాటి సాధనకు కృషి చేయాలని వారు వివరించారు. అనంతరం నూతన కమిటీని వారు ప్రకటించారు. ఏరియా అధ్యక్షులుగా ఏరియా అధ్యక్షులుగా బానోత్ రాము నాయక్ (సివిల్ ఇంజనీర్) గౌరవ అధ్యక్షులుగా వాంకుడోత్ దుప్ సింగ్, ఉపాధ్యక్షులుగా గుగులోత్ రాంబాబు, రాజయ్య, ప్రధాన కార్యదర్శిగా ధారావత్ తిరుపతి , వర్కింగ్ ప్రెసిడెంట్ గా అశోక్ , ఆర్గనైజింగ్ సెక్రటరీగా భూక్య ప్రవీణ్ , కోశాధికారిగా బాలకృష్ణ , సంయుక్త కార్యదర్శిగా భూక్యా రవి ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని స్పష్టం చేశారు.






