కారేపల్లి, మహా:మండల పరిధిలోని దుబ్బ తండా గ్రామంలోని లక్ష్మి వినాయక అగ్రి మాల్ ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా ఆదివారం మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.అత్యధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు,లక్ష్మి వినాయక అగ్రీమాల్ నిర్వాహకులు వివిధ రకాల వంటకాలతో అన్న ప్రసాదాన్ని అందించారు.ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తజనులు అధిక సంఖ్యలో పాల్గొని మహా అన్నదాన ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆంగోత్ శ్రీను, లక్ష్మణ్, సురేష్, వినోద్, లాలి, పద్మ, అనూష, సరూప, భూక్య రమేష్, నీలా తదితరులు పాల్గొన్నారు
Post Views: 23






