కారేపల్లి, మహా : పల్లెలో పారిశుధ్యం పనులతో ప్రజలను రోగాల బారి నుండి కాపాడుతున్న పంచాయతీ కార్మికులతో ప్రభుత్వాలు వెట్టిచారికి చేయించుకుంటున్నాయని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కొండబోయిన నాగేశ్వరరావు విమర్శించారు. ఆదివారం కారేపల్లిలోని భాగం రామనర్సయ్య భవన్లో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్(సీఐటీయు) కారేపల్లి మండల మహాసభ జరిగింది. ఈసభలో కొండబోయిన నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం తీసుకవచ్చి మల్టీపర్పస్ విధానం కార్మికులను కాలరాసేదిగా ఉందన్నారు. నెలవారి వేతనాలు లేక కార్మికుల కుటుంబాలు అవస్ధల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు నిధులు లేక పారిశుధ్య పనులు, మరమ్మత్తులు చేయలేక పంచాయతీ ప్రజల ఈసడిరపులకు గురవుతున్నారన్నారు. పోరాటాలతోనే కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత సాధ్యమన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ (సీఐటీయు) మండల నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షకార్యదర్శులు ఎస్కె.హుస్సెన్, శాతురాజుపల్లి నాగేశ్వరరావు తో పాటు మరో 19 మందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.






