ఇల్లెందు, మహా.
తెలంగాణ ఆదర్శ గ్రామపంచాయతీ అండ్ మున్సిపల్ వర్కర్ యూనియన్(ఐ ఎఫ్ టి యు)ఇల్లందు మండల కమిటీ సమావేశం ఆదివారం ఇల్లందు ఐఎఫ్టియు కార్యాలయంలో మండల నాయకురాలు ఈసం అరుణ అధ్యక్షతన జరిగింది. సమావేశంలోఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కొక్కుసారంగపాణి, గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుతొగరసామెల్,డి.ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని,కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 7న హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగు రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. పంచాయతీ కార్మికులు గ్రామాలను శుభ్రపరుస్తూ గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని అన్నారు.పొద్ద స్తమానం గ్రామపంచాయతీలలో విధులను నిర్వహిస్తూ చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణ భారం అవుతుందని వారు ఆవేదన వ్యక్తంచేశారు.గ్రామపంచాయతీ కార్మికులకు పిఎఫ్, ఈఎస్ఐసౌకర్యంకల్పించాలనికార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ జరుగు సదస్సును గ్రామ పంచాయతీ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐ ఎఫ్ టి యు ఇల్లందు ఏరియా కమిటీ అధ్యక్షులు రావూరి ఉపేందర్ రావు, గ్రామపంచాయతీ వర్కర్ యూనియన్ మండల నాయకులు చింతల భాగ్యమ్మ, భానోత్ భీముడు, భూక్య తిరుపతి, రామిశెట్టి నరసింహారావు,ప్రవీణ్,మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.






