Mahaa Daily Exclusive

  ట్రాఫిక్ పేరుతో చిరు వ్యాపారులపై అధికారుల జబర్దస్త్.? వ్యాపారులకు మౌలిక సదుపాయాలు కల్పించాలి సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి..!

Share

రంగారెడ్డి జిల్లా మహా:

ఈరోజు చేవెళ్ల మండల కేంద్రంలోని రైతు బజార్ ను సందర్శించిన సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు కే రామస్వామి అక్కడ ఉన్న చిరు వ్యాపారులతో వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చేవెళ్ల మున్సిపాలిటీ కేంద్రంలోని బస్టాండ్ దగ్గర హైదరాబాద్ బీజాపూర్ రహదారికి ఇరువైపులా చిన్నచిన్న షాపులు వేసుకొని పండ్లు, పువ్వులు, రోజువారీగా కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులను ట్రాఫిక్ సమస్య కారణంగా మున్సిపల్, పోలీస్ సిబ్బంది ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, చిరు వ్యాపారస్తుల డబ్బాలను షాపులను తొలగించి రైతు బజార్ కు తరలించారు. కానీ రైతుబజార్ లో మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్లు, కరెంటు వీధిలైట్లు, ఎలాంటి మౌలిక సదుపాయాలు లేక, చిరు వ్యాపారులు ప్రతిరోజు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సాయంత్రం ఆరు దాటితే కారు చీకట్లో వ్యాపారం ఎలా సాగుతుందని ప్రశ్నించారు. కూరగాయలు పూలు పండ్లు కొనుక్కోవడానికి, వినియోగదారులు అక్కడ అంతా చీకటిగా ఉండడంతో అటుగా రావడానికి భయపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి రైతు బజార్లో కావలసిన మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలని, లేనిచో చిరు వ్యాపారులతో రైతులతో పార్టీ శ్రేణులతో కలిసి హైదరాబాద్ బీజాపూర్ హైవే పైన పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని ప్రభుత్వానికి, అధికారులకు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం ప్రభు లింగం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్ల సత్యనారాయణ మండల పార్టీ కార్యదర్శి ఎం సత్తిరెడ్డి కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Latest