Mahaa Daily Exclusive

  బిజెపి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి హౌస్ అరెస్ట్…!

Share

రాజేంద్రనగర్ మహా ; ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తల్లి ప్తె అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ, రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దహనం చేసే కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో, రాజేంద్ర నగర్ నియోజక వర్గ ఇంచార్జ్ డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి ని మైలార్దేవుపల్లి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీహార్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ తల్లిని అసభ్య పదజాలంతో దూషించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది కేవలం ప్రధానమంత్రిని అవమానించడం మాత్రమే కాదు, భారతదేశ మాతృమూర్తుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న అసభ్య దృక్పథాన్ని స్పష్టంగా చూపిస్తుందని కార్పొరేటర్ తో కల శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
రాహుల్ గాంధీ వెంటనే తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని బహిరంగ క్షమాపణలు చెప్పాలని బిజెపి రాజేంద్రనగర్ ఇన్చార్జ్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డిని డిమాండ్ చేశారు.

Latest