రాజేంద్రనగర్ మహా ; సయ్యోగ్ చారిటబుల్ ట్రస్టు సేవా సంస్థ ఆధ్వర్యంలో మణికొండ మర్రిచెట్టు కూడలిలోని మున్సిపల్ కమ్యూనిటీ హాల్ లో మెడికేర్ డయాగ్నొస్టిక్ ఓయు కాలనీ సహకారంతో మేఘా ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు.
వైద్యులు గైనకాలజిస్ట్ డాక్టర్ జయశ్రీ రెడ్డి, కార్డియాలిస్ట్ డాక్టర్ శ్రీరాములు కడియాల, ఆర్టోపడిక్ డాక్టర్లు రవి తేజ, రవీష్ అజ్మీరా, న్యూరో డాక్టర్ శ్యామ్ కె జైస్వాల్, ఆంకాలజిస్ట్ డాక్టర్ నిషీత్ వడ్డెబోయిన, జనరల్ ఫిజియన్ డాక్టర్లు పిపి రమ్యా, డాక్టర్ కృష్ణయ్యజీ, ఫ్యామిలీ ఫిజియన్ డాక్టర్ నరసింహ రావు, డెంటల్ డాక్టర్ శ్రీకాంత్, సైకాలజిస్ట్ వినీల అన్నే, ఆక్యుపంక్చర్ డాక్టర్ మనోహర్ ల పర్యవేక్షణలో దాదాపు వెయ్యికి మందికి పైగా రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచిత మందులను పంపిణీ చేశారు. మందులతో పాటు, సంబంధిత ఫైబ్రో స్కాన్, బాడీ మాస్ ఇండెక్స్, డయాబెటిక్ న్యూరో పతి, లిపిడ్ ప్రొఫైల్, టుడిఎకో, ఈసిజీ, హెచ్బిఏ1,సి, విటమిన్ డి, షుగర్ టెస్ట్ బీపీ టెస్ట్ పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఉచిత వైద్య శివరాన్ని మణికొండ మున్సిపాలిటీ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు మేనేజింగ్ ట్రస్టీ అందె లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.






