Mahaa Daily Exclusive

  మణుగూరులో వాగు ఉద్ధృతి.. ప్రయాణాలు వద్దు..!

Share

మణుగూరు వాగు మల్లారం వద్ద బ్రిడ్జిపై నుంచి భారీగా వరద ప్రవహిస్తుండటంతో అటువైపు ప్రయాణాలు చేయవద్దని తహశీల్దార్ అద్దంకి నరేశ్ సూచించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. రాత్రి వేళల్లో ఆ మార్గంలో ప్రయాణించడం సురక్షితం కాదని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలు అధికారుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేశారు

Latest