Mahaa Daily Exclusive

  నర్సయ్యతాత ట్రెండ్ సెట్టర్ అగ్నిపరీక్ష నుండి.. 60 ఇంటర్వ్యూల దాకా.. పక్షం రోజుల్లో పదికోట్ల వీక్షణలు.. మోతమోగించిన తాత..!

Share

(మహా స్పెషల్)
బిగ్ బాస్ షో అంటే.. ఒకప్పుడు సెలబ్రిటీలతో చూడబుల్ గా ఉండేది. ఇపుడంతా స్క్రాప్ బ్యాచే. టాలెంట్ ఉన్నోళ్ళని తొక్కేస్తారు.. టాలెంట్ లేనోళ్ళని నెత్తిన పెట్టుకుని ప్రేక్షుకులకు అగ్నిపరీక్ష పెడతారు. రాను రానూ.. ఆ సెలబ్రిటీ షో క్రిడిబిలిటీ కాస్తా… యూట్యూబ్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ షోగా మారిపోయింది. ఎవరైతే సోషల్ మీడియాలో రచ్చ చేస్తూ హాట్ టాపిక్ అవుతుంటారో ఇప్పుడు వాళ్లే బిగ్ బాస్ కంటెస్టెంట్స్. ఆడిషన్స్ కు వందలాది మంది అప్లై చేయగా.. వాళ్లలో ఐదుగుర్ని బిగ్ బాస్ సీజన్ 9 హౌస్‌లోకి పంపించబోతున్నారు. ఈ ప్రాసెస్‌కి బిగ్ బాస్ అగ్నిపరీక్ష అనే పేరు పెట్టారు. ఈ షోకి శ్రీముఖి హోస్టింగ్‌తో పాటు.. సూపర్ జడ్జీగా వ్యహరిస్తున్నారు. నవదీప్, బిందుమాధవి, అభిజిత్‌లు జడ్జీలుగా ఉన్నారు.

లెక్కలేదు.. ఓటింగ్ లేదు

అగ్ని పరీక్ష ఓ ప్రహసనంలా మారింది. ఈ ప్రాసెస్‌లో భాగంగా.. కొంతమందిని ఎంపిక చేయగా.. మరికొంతమందిని రిజెక్ట్ చేస్తున్నారు. ఎన్నో ఆశలతో ఆ స్టేజ్‌పైకి వచ్చిన వాళ్లని చిన్న చిన్న కారణాలతో రిజెక్ట్ చేసిపారేస్తున్నారు. కొందరికి అవకాశాలు ఇవ్వకుండా.. ముందే తమ వద్ద లిస్ట్ ఉన్నట్లు.. వీరు సెలెక్ట్.. వీరు రిజెక్ట్ అనేస్తున్నారు. నిజానికి ఇది కంటెస్టెంట్స్‌ కంటే జడ్జీలకు అగ్నిపరీక్షగా మారింది. వాళ్లు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారూ.. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారనేదానికి ఎలాంటి లెక్కలూ లేవు. అంతా మా ఇష్టం అనేశారు. వాళ్ళు ముందే సిద్దం చేసుకున్న జాబితాలో లేకుంటే.. వద్దు అని పంపించేస్తున్నారు. ఎలాంటి ఓటింగ్ లేదు.

నర్సయ్యతాత షాక్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష రెండో ఎపిసోడ్‌లో ప్రముఖ ఫోక్ సింగర్, ఎఎన్ఎన్ యాంకర్ నర్సయ్య తాత అలియాస్ నీల నర్సింహ పాల్గొనగా, ఆయనని ఎలిమినేట్ చేసిన తీరుపై పబ్లిక్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జడ్జిలు నవదీప్, బిందుమాధవి, అభిజిత్ లపైనెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గొర్రెల కాపరిగా బిగ్ బాస్ అగ్నిపరీక్ష స్టేజ్‌పైకి వచ్చిన నర్సయ్య తాత.. తన ఆట పాటలతో మెప్పించాడు. బిగ్ బాస్ హౌస్‌కి ఎందుకు వద్దాం అని అనుకుంటున్నారు? అని అడిగింది బిందు మాధవి. ‘నా పాటతోటి ఈ సమాజాన్ని మార్చాలి.. పాటకి ఉన్న శక్తి ఇక్కడితో ఆగిపోకూడదు.. జనంలో చైతన్యం తీసుకుని రావాలి. నా పాట ప్రపంచానికి తెలియాలి.. దానికో ప్లాట్ ఫామ్ కావాలి.. అది బిగ్ బాస్ అయితే బావుంటుందని ఇక్కడికి వచ్చాను’ అని అన్నాడు నర్సయ్య తాత. ఆయన చెప్పిందంతా విన్న బిందు మాధవి.. ‘మీరు హౌస్‌లో ఉండగలరో లేదో అని డౌట్ ఉంది అంటూ రెడ్ ఇచ్చి రిజెక్ట్ చేసింది. దాంతో నర్సయ్య తాత… అమ్మా మీరు ఏ టాస్క్‌లు పెట్టినా ఆడతా.. దయచేసి తీసేయొద్దు’ అని వేడుకున్నాడు. దాంతో సూపర్ జడ్జీగా ఉన్న శ్రీముఖి.. ‘టాస్క్‌లు పెడితే ఆడతానన్నారు కదా.. ఆ రోప్‌కివెళ్లి వేలాడుతూ మాట్లాడు’ అని అన్నది. దాంతో నర్సయ్య తాత.. వయసుతో సంబంధం లేకుండా.. వెళ్లి ఆ రోప్‌కి వేలాడుతూ ఉన్నాడు. ‘పాటలు పాడతారని హౌస్‌లోకి పంపించడం కరెక్ట్ కాదు’ అని నవదీప్ కూడా రెడ్ కార్డ్ ఇస్తే.. అభిజిత్ కూడా రెడ్ కార్డ్ ఇచ్చేసి మీరు ఈ హౌస్‌కి సెట్ కారు అని అన్నాడు. దాంతో నర్సయ్య తాత రెండో మాట మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

అవకాశం ఎక్కడ ఇచ్చారంటూ నెటిజన్ల ఫైర్

అయితే నర్సయ్యతాత సెట్ అవుతాడా లేదా? అన్నది తెలియాలంటే.. ముందు అతనికి ఓ అవకాశం ఇచ్చి చూడాలి కదా.. అదే అవకాశం మిగిలిన వాళ్లకీ ఇచ్చారు కదా.. కానీ నర్సయ్య తాత విషయంలో మాత్రం జడ్జీలు తప్పుడు నిర్ణయం తీసుకున్నారని నెటిజన్లు, ప్రేక్షకులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. రోప్‌కి వేలాడదీసి.. అతను టాస్క్ కంప్లీట్ చేసిన తరువాత కూడా అకారణంగా బయటకు పంపడం అయితే నర్సయ్య తాతకి అన్యాయం జరిగినట్టే అంటూ వేలాదిగా ఆయనకు మెసేజ్ లు పెట్టారు.

నర్సయ్యతాతకు క్రేజ్

తన ఆటపాటలతో ప్రజలను ఆకట్టుకునే నర్పయ్యతాతకు బిగ్ బాస్ హౌజ్ లో అన్యాయం జరగడంపై నెటిజన్లు నర్సయ్యతాత నీకు అన్యాయం జరిగింది అంటూ మెసేజ్ లు చేశారు. ఈ క్రమంలో నర్పయ్యతాత బిగ్ బాస్ ప్రోమోలు మాటీవీ, హాట్ స్టార్ లో హైలెట్ కావడం, నెటిజన్ల స్పందన వెరసి.. ఆయన క్రేజ్ వచ్చింది. దీంతో ఏకంగా 60కు పైగా ఛానళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆయన ఇంటర్వ్యూలను వివిద వేదికల్లో పదికోట్లకు పైగా వీక్షించారు. బిగ్ బాస్ లో వాళ్ళు తప్పుచేశారు కానీ.. ఈ ఇంటర్వ్యూలతో ఆ ముగ్గురు కోతిబ్యాచ్ ను ఎండగట్టి ఎఎన్ఎన్ నర్సయ్య తాత ఎదురులేని తాతగా నెట్టింట బిగ్ బాస్ అయ్యాడంటూ నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.

ప్రగతి భవన్‌ని తాకిన నర్సయ్య తాత పాట

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం లక్ష్మాపురానికి చెందిన నర్సయ్య తాతా అసలు పేరు నీల నర్సింహ. తన తండ్రి వారసత్వంగా గొర్రెల కాపరి అయిన నర్సయ్య తాత అప్పట్లోనే పదో తరగతి వరకూ చదువుకున్నాడు. సాహిత్యంపై మంచి పట్టున్న నర్సయ్య తాత.. పాటలు రాయడం, పాడటం ద్వారా ఫోక్ సాంగ్స్‌తో తన గొంతు వినిపించాడు. తాను గొర్రెల కాపరి అయినా కూడా.. అద్భుతమైన సాహిత్యంతో పాట రాసి పాడటంలో మహా దిట్ట నర్సయ్య తాత. ప్రపంచ తెలుగు మహాసభల్లోనూ తన ప్రతిభ చూపించారు నర్సయ్య తాత. తన పాట ప్రగతిభవన్ కోటలు దాటడంతో.. సీఎం కేసీఆర్ మన్ననలు పొందారు నర్సయ్య తాత. స్వయంగా ప్రగతి భవన్‌కి వెళ్లి కేసీఆర్‌ని కలిసి.. ఆయనతో కలిసి భోజనం చేసి వచ్చారు నర్సయ్య తాత. ప్రముఖ న్యూస్‌ ఛానల్‌లో యాంకర్‌గా అవతారం ఎత్తిన నర్సయ్య తాత.. గత ఆరేడేళ్లుగా వివిధ కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ప్రముఖ న్యూస్ ఛానల్ ఎఎన్ఎన్ తెలుగులో యాంకర్ గా మార్నింగ్ న్యూస్ చదువుతూ, వర్తమాన రాజకీయాలు విశ్లేషిస్తున్నారు. తన ఇంటర్వ్యూలతో సెలబ్రిటీలను రప్పారప్పా అంటూ వినూత్న ముద్ర వేస్తున్నారు. అన్యాయాలపై పోరాడే గళమయ్యారు.

అంతా మనమంచికే
బిగ్ బాస్ అగ్నిపరీక్షకి మిమ్మల్ని ఎంపిక చేయకపోవడంపై మీరేమంటారని అడిగితే.. ‘‘మనసుకి ముసుగేసే మాయ మాటల గుణముతోటి వాడితో నీకెందుకురా ఈ రణము. బిగ్ బాస్ షోలో నర్సయ్య తాతని ఆపేయడం అంటే ఓ శక్తిని ఆపేయడమే. నర్పయ్యతాత తెలుగుదనంపై రాసిన పాట తెలుగునాట 20లక్షల మంది ప్రజలు వీక్షించారు. నవదీప్ మత్తులో తోపు అంటూ జడ్జిల మత్తుదింపే ప్రయత్నం చేశారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు, విన్నర్ల కంటే కూడా నర్పయ్యతాతకే డిమాండ్ పెరిగింది. ఆయన ఇంటర్వ్యూల కోసం ప్రతిరోజూ ఐదారు ఛానళ్ళ నుండి ఫోన్లు వస్తున్నాయి. ఇప్పటికి 60 ఛానళ్ళకు ఆయన ఇంటర్వ్యూలిచ్చారు. బిగ్ బాస్ అనుభవాలు, మోసాలు కళ్ళకు కట్టారు. బిగ్ బాస్ బయటికివచ్చి.. మీరు అగ్నిపరీక్ష జడ్జిలకు పెట్టారు అంటూ అభిమానులు అభినందిస్తున్నారు.

Latest