కొమురం భీం ఆసిఫాబాద్ మహా : ఉపాధ్యాయులు జాతి నిర్మాతలంటూ ఓపైపు వారిని కీర్తిస్తూ గురుపూజోత్సవం రోజున సత్కరిస్తుంటే మరికొందరు టీచర్లు మాత్రం ఆ వృత్తికే కళంకం తెస్తున్నారు. ఉపాధ్యాయ దినోత్సవానికి జిల్లా లో కార్యక్రమాలు నిర్వహిస్తున్న వేళ ఓ టీచర్ మాత్రం కడుపు నిండా మందు సేవించి మత్తులో స్కూల్లోనే నిద్రపోయారు. కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం సుకుడ్ పల్లి ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘన చోటు చేసుకుంది. ఇక్కడి స్కూల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు జే విలాస్ మద్యం తాగి పాఠశాలకు రావడంపై గ్రామస్థులు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయగా గతంలోనే ఇతన్ని సస్పెండ్ చేసారు. అయినా తాగి మళ్లీ పాఠశాలకు వచ్చాడని గ్రామస్తులంటున్నారు.
Post Views: 7






