నిర్మల్ మహా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో నిర్వహించే గణేష్ నిమజ్జనానికి పటిష్ట నిఘాను ఏర్పాటుచేసినట్లు జిల్లా ఎస్పీ జానకి షర్మిళ అన్నారు. శోభాయాత్ర ఆద్యంతం ప్రశాంతంగా కొనసాగాలని అందుకు తగ్గట్టుగా బందోబస్తును ఏర్పాటుచేసినట్లు తెలిపారు. ఇందులో 1 అడిషనల్ ఎస్పీ, ఇద్దరు ఏఎస్పీలతో పాటు మొత్తం 600 మంది పోలీసులు బందోబస్తులో పాల్గొన్నట్లు పేర్కొన్నారు. అలాగే భైంసా పట్టణంలో ముందు ఉన్న కెమెరాలకు ఇంకా 100 నుండి 200 సీసీ కెమెరాలను అధికంగా ఏర్పాటుచేసినట్లు వీటిని కమాండ్ కంట్రోల్ తో పాటు, హైదరాబాద్ లోని సీసీసీ కమాండ్ కంట్రోల్ కి అనుసంధానం చేసినట్లు తెలిపారు. వారు కూడా ఇక్కడ జరిగేదంతా పర్యవేక్షిస్తారన్నారు. అదేవిధంగా ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేక పికెటింగ్ లను ఏర్పాటుచేసినట్లు పూర్తిగా భైంసా పట్టణం పోలీసుల అధీనంలో ఉందన్నారు. గణేష్ నిర్వాహకులు ప్రశాంత వాతావరణంలో నిమజ్జన శోభాయాత్ర నిర్వహించాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట నిఘాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.






