వరంగల్ మహా;
గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా శుక్రవారం నిర్వహించనున్న శోభయాత్రలకు
పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్రైత్ సింగ్ వెల్లడించారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ తో కలిసి మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, కమీషనర్ చాహత్ బాజ్ పాయ్ సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలిమా, అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ రావు, వరంగల్ సబ్ డివిజన్ ఏఎస్పి శుభం తో కలిసి వరంగల్ వడ్డేపల్లి చెరువు, ఉరుసు గుట్ట చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ గణేష్ నిమజ్జనోత్సవాలను శాంతియుతంగా నిర్వహించేదుకు వరంగల్ పోలీస్ కమిషనరేటు పరిధిలోని సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ జోన్ల పరిధిలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. ఇందుకు గాను నలుగురు డీసీపీలు, ఇద్దరు అదనపు డీసీపీలు, 15 మంది ఏసీపీలు, 53 మంది ఇన్ స్పెక్టర్లు, 70 మంది ఎస్సైలతో పాటు ఏఎఎస్సై, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డ్స్ తో కలుపుకొని మొత్తం 2,100 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో ప్రత్యేకించి ట్రై సిటీ పరిధిలోనే 1,600 మంది బందోబస్తు విధులు | నిర్వహిస్తున్నారన్నారు. శోభయాత్రతో పాటు నిమజ్జనోత్సవం సజావుగా సాగేందుకు అధిక సంఖ్యలో సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వీటి ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. గణేష్ శోభయాత్ర నిర్వహించే మార్గంలో ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ మళ్ళింపు కొనసాగించడంతో పాటు అన్ని ముఖ్యమైన జంక్షన్లు, ముఖ్యమైన మార్గాల్లో ట్రాఫిక్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు.
నిబంధనలు పాటించాలి
శోభయాత్రలో ప్రతి ఒక్కరూ పోలీసుల సూచనలు పాటించాల్సిందేనని పోలీస్ ఊరేగింపులో శాంతియుత కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. నిమజ్జన వాతావరణం నిర్వాహకులు నిమజ్జనం కోసం వాహనాలను కొనసాగించాలన్నారు. ముందుగానే ఏర్పాటు చేసుకోవాలని, ఆడియో సిస్టమ్స్ నిర్ణీత స్థాయిలో ఉపయోగించాలని. డీజేలు పూర్తిగా నిషేధమన్నారు. వాహనాలను ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా నడపాలని, ప్రార్ధన మందిరాల వద్ద నిలపరాదని, శోభయాత్ర వేళ బానాసంచా కాల్చడం నిషేధమన్నారు. శోభయాత్ర కొనసాగే మార్గంలో విద్యుత్తు తీగలను గమనిస్తూ యాత్ర కోనసాగాలని, ముఖ్యంగా నిమజ్జనం ప్రాంతానికి చిన్నపిల్లలను తీసుక వెళ్ళకుండా జాగ్రత పడాలన్నారు. అనుమానస్పద వ్యక్తులు, వస్తువులు కనిపించినప్పుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. పుకార్లు నమ్మరాదన్నారు. మద్యం సేవించి ఊరేగింపులో పాల్గొనరాదన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామ హెచ్చరించారు. అత్యవసర సమయంలో 100 కి డయల్ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బస్వరాజు కుమారస్వామి,కావటి కవిత, ఎమ్మార్వోలు, ఆర్డిఓ ఇరిగేషన్, రెవెన్యూ, బల్దియా అధికారులు, తదితరులు పాల్గొన్నారు






