Mahaa Daily Exclusive

  భూపాలపల్లి జిల్లాలో 107 మంది గ్రామ పాలనాధికారుల నియామకం..!

Share

భూపాలపల్లి, మహా :
భూపాలపల్లి జిల్లా నుండి గ్రామ పాలన అధికారులుగా ఎంపికైన అభ్యర్థులు సీఎం చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు స్వీకరించేందుకు హైదరాబాద్ వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.గురువారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా నుండి మొత్తం 107 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని, వారందరూ శుక్రవారం హైదరాబాద్ వెళ్లనున్నట్లు తెలిపారు.
శుక్రవారం ఐడిఓసి కార్యాలయం నుండి ఉదయం 8 గంటలకు ప్రత్యేకంగా 2 బస్సులు హైదరాబాద్ వెళ్లుటకు సిద్ధంగా ఉంటాయని తెలిపారు. ప్రతి బస్సులో పర్యవేక్షణకు లైజన్ అధికారులను పోలీస్ సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. అభ్యర్థులు సకాలంలో ఐడిఓసి కార్యాలయానికి చేరుకోవడానికి ముందస్తు సమాచారం అందజేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. హైదరాబాద్ హైటెక్స్ లో సీఎం అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. తిరిగి ఇంటికి క్షేమంగా చేరే వరకు జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు.ఈ టెలి కాన్సరెన్స్ లో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, తదితర అధికారు లు పాల్గొన్నారు.

పెద్దగుట్టపై ట్రెక్కింగ్ చేసిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

కాటారం మండలంలోని ప్రతాపగిరి పంచాయతీ పరిధిలోగల పెద్ద గుట్టపై గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేలు ట్రెక్కింగ్ చేశారు. గొంతెమ్మ గుట్టకు పక్కనే గల పెద్దగుట్టపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ట్రెక్కింగ్ చేశారు. చీకటి పడడంతో మధ్యనుండే తిరుగు ప్రయాణమయ్యారు. కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిఎఫ్ ఓ నవీన్ రెడ్డి, డిఎస్పి సూర్యనారాయణ,ఎఫ్ఆర్ఓ సురేందర్ పాల్గొన్నారు.

వినాయక నిమజ్జనం లో జాగ్రత్తలు పాటించాలి

వినాయక నిమజ్జనంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.5వ తేదీన జరుగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమంలో
తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గురువారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వినాయక నిమజ్జనం కార్యక్రమంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. 9 రోజుల పాటు ప్రజలు ఎంతో భక్తి శ్రద్దలతో అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకున్నారని అన్నారు. నిమజ్జన కార్యక్రమంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. వినాయక నిమజ్జనం వేళ నిర్వాహకులు, భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు.
నిమజ్జనం చేసేవారు వినాయకుడిని వాహనంలో ఎక్కించేటప్పుడు, నిమజ్జనం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలని లేనిచో ప్రమాదాలు జరగడానికి అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు.
వినాయక నిమజ్జన సమయంలో మహిళలు, వృద్ధులు, చిన్న పిల్లలు చెరువు వద్ద జాగ్రత్తలు వహించి దూరంగా ఉండాలని, టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు వహించాలని, విగ్రహాలు విద్యుత్ కు తాకకుండా జాగ్రత్తలు వహించాలని తెలిపారు. అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఆయన తెలియజేశారు. నిర్దేశించిన ప్రాంతంలో మాత్రమే విగ్రహాలు నిమజ్జనం చేయాలన్నారు. నిమజ్జనానికి చిన్నారులను తీసుకెళ్లొద్దని, పరిమిత సంఖ్యలో మాత్రమే సంఖ్యలో అనుమతించాలని, మద్యం సేవించి వెళ్లరాదని సూచించారు. సరదా మాటున ప్రమాదాలకు గురికావొద్దని అది తీరని బాధను మిగుల్చుతుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.

Latest