Mahaa Daily Exclusive

  ప్రభుత్వ ఆసుపత్రి సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి నర్సంపేట ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా కలెక్టర్ ..!

Share

వరంగల్ మహా;

వరంగల్ జిల్లా నర్సంపేట లోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతన సిటీ స్కానింగ్ మిషన్ సేవలను గురువారం కలెక్టర్ డాక్టర్ సత్య శారద తో కలసి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సిటీ స్కాన్ సేవలను నియోజకవర్గం ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మాధవ రెడ్డి కోరారు.
మన రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల ఆరోగ్యశ్రీ పథకం అందిస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య సేవలు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డిఎం హెచ్ ఓ డాక్టర్ సాంబశివరావు, ఆర్డీవో ఉమారాణి ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్లు మోహన్ దాస్, కిషన్, మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, ప్రభుత్వ డాక్టర్లు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Latest