భూపాలపల్లి,మహా :
టస్సార్ పట్టు వస్త్రాలు వ్యాపారాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని సాన్ ఫ్రాన్సిస్కో, బృనై దౌత్య కార్యాలయాల అధికారులు శ్రీకర్ కె రెడ్డి, రాము అబ్బగాని తెలిపారు.మహాదేవపూర్ మండలం, టస్సార్ కాలనీలో పట్టు వస్త్రాలు నేస్తున్న ప్రక్రియను పరిశీలించారు.
హైదరాబాద్ శిల్పారామంలో పట్టు వస్త్రాలు విక్రయానికి అనువుగా స్టాల్‌ను ఏర్పాటు చేయించినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. పట్టు వస్త్రాలను ఆన్లైన్ ద్వారా, ఇక్కడ నేస్తున్న పట్టు వస్త్రాలను టెస్కో ద్వారా విక్రయాలకు ఆవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు.
పట్టు గుడ్లు నుండి దారం తీస్తున్న తీరును, వస్త్రాలు నేస్తున్న విధానాన్ని గొర్రె బాబు ఎంతో ఆసక్తిగా వీక్షించి అభినందించారు.
వ్యాపారం ఎలా ఉంటుందని గొర్రె బాబు ను అడిగి తెలుసుకున్నారు.
పట్టు వస్త్రాలకు మంచి డిమాండ్ ఉన్నదని అన్ని సమస్యలు అదిగమిస్తూ అవకాశాలను అందిపుచ్చుకుని వ్యాపార వేత్తలుగా ఎదగాలని వారు ఆకాంక్షించారు.
వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేయాలి కలెక్టర్ రాహుల్ శర్మ
వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రహదారుల మరమ్మతులు తక్షణమే చేపట్టి ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు.
గురువారం ఐడిఓసి కార్యాలయంలో మిషన్ భగీరథ, పంచాయతీ రాజ్, మున్సిపల్ అధికారులతో వర్షాలు, వరదల కారణంగా కలిగిన నష్టాలపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న రహదారులు మరమ్మత్తులు చేయాలని ఆదేశించారు. దెబ్బతిన్న వనరుల పునరుద్ధరణకు విభాగాలవారీగా ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.
ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో వేగంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.జిల్లాలో వర్షాలు, వరదల ప్రభావం వల్ల నష్టపరిహార పనులు త్వరితగతిన పూర్తిచేసేందుకు అంచనా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, మిషన్ భగీరథ ఈఈ శ్వేత,పంచాయతీరాజ్ ఈఈ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






