రంగారెడ్డి జిల్లా మహా:
ఈ నెల 5వ తేదీ శుక్రవారం నాడు గచ్చిబౌలిలోని హైటెక్స్ లో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. ఏనుముల రేవంత్ రెడ్డి చేతుల మీదుగా గతంలో వీఆర్ఓలుగా పని చేసిన వారికి గ్రామ పాలన అధికారులగా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను, గురువారం రెవెన్యూ శాఖ సెక్రటరీ లోకేష్ కుమార్ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లలో ఎలాంటి పొరపాట్లు జరగకుండ చూడాలని, ఏర్పాట్లపై సంబంధిత అధికారులకు వారు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ పరిశీలనలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, హైదరాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ ముకుంద రెడ్డి, మాదాపూర్ డీసీపీ వినిత్, సీసీఎల్ఏ కమిషనర్ మకరందం, జిల్లా అధికారులు, ఆర్డీఓలు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
Post Views: 36






