రోడ్లపై నాట్లు వేసిన బిఆర్ఎస్ నాయకులు
షాద్ నగర్, మహా:
వెళ్లడానికి వీలు లేని రోడ్లతో గ్రామీణలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా రోడ్లపై కొందరు నాట్లు వేస్తున్నారు. పర్వతాపూర్ నుండి నావాబుపేట పిడబ్ల్యుడి రోడ్ వరకుగల ప్రధాన రోడ్డు రాకపోకలు బందుకావడం వలన పర్వతాపూర్ మీదుగా తంగళ్లపల్లి, వెంకీర్యాల, విశ్వనాధ్పూర్ గ్రామాల ప్రజలు వెళుతుంటారు. ముక్యంగా పర్వతాపూర్ గ్రామస్థులు కొందుర్గు వివిధ గ్రామాలకు వెళ్లే ప్రధానరోడ్డు రాకపోకలు బందుకావడం పర్వతాపూర్ నుండి నావాబుపేట రోడ్డు వరకు 2 కిలోమీటర్లు రోడ్డు బందుకావడం వలన 6 కిలోమీటర్లు అదనంగా రావలసి వస్తుంది. ప్రజలఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం స్పందించి బీటీగా మార్చాలని అంతవరకు ప్రజలరకపోకలు సాగేటట్లుగా మారమ్మత్తులు చేయాలని పర్వతాపూర్ మాజీ సర్పంచ్ దర్గ సరస్వతి వెంకటేష్ ప్రభుత్వాన్ని కోరారు. ఇట్టి కార్యక్రమంలో గ్రామ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రసిడెంట్ డబ్బు శ్రీనివాస్, కాశ మల్లేష్, నరేందరరెడ్డి, భానుప్రకాష్, పత్తి పెంటయ్యలు పాల్గొన్నారు..






