ఆదిలాబాద్ మహా : ప్రముఖ తత్త్వకవి ఉదారి నాగదాసు స్మారక కవితా అవార్డు ప్రదానోత్సవం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో ఘనంగా జరిగింది. ప్రముఖ కవయిత్రి తోట నిర్మలారాణి అవార్డు ను అందుకున్నారు. ఉదారి కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రతీ సంవత్సరం ఒక సాహితీవేత్తకు స్మారక అవార్డ్ ప్రదానం చేస్తున్నారు. అవార్డుకు తనను ఎంపిక చేయడం పట్ల కవయిత్రి నిర్మలా రాణి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షులు కొండి మల్లారెడ్డి, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ సంగీత, నిర్మల్ జిల్లా తెరవే అధ్యక్షులు నేరెళ్ల హన్మంతు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
Post Views: 22






