Mahaa Daily Exclusive

  అంద‌రికి ధ‌న్య‌వాదాలు -ఎస్పీ..!

Share

ఆదిలాబాద్ మ‌హా : ఆదిలాబాద్ జిల్లాలోని గణపతి నవరాత్రి ఉత్సవాలు శ‌నివారం నిమ‌జ్జ‌నంతో ప్ర‌శాంతంగా ముగిసిన‌ట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఇందుకు శ్ర‌మించిన జిల్లా పోలీసు యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగానికి ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ప్రశాంతంగా నవరాత్రి ఉత్సవాలను పూర్తి చేయడానికి స‌హ‌క‌రించిన జిల్లా ప్ర‌జ‌లు, గణపతి మండపాల నిర్వాహకులు, హిందూ సంఘాల నాయకులంద‌రికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి సంస్కృతి ప్రతి ఏటా కొనసాగాలని కోరారు. అదేవిధంగా 11 రోజులపాటు 24 గంటలు శ్రమించిన పోలీసు సిబ్బంది సివిల్, రిజర్వ్, హోంగార్డ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ, క్యూఆర్టి వారికి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా 150 మంది ఎన్సిసి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సక్రమంగా విధులు నిర్వర్తించి తమ వంతు పాత్ర పూర్తి చేసినందుకు అభినందనలు తెలియజేశారు.

Latest