కారేపల్లి, మహా : కారేపల్లి సోసైటీలో రైతులకు కూపన్లపై యూరియా పంపిణిని ఆదివారం సింగరేణి తహసీల్ధార్ అనంతుల రమేష్, ఎస్సై బైరు గోపీ లు తనిఖీ చేశారు. సోసైటీ గోడౌన్‌లో ఎరువులను, స్టాక్ రికార్డులను వారు పరిశీలించారు. కూపన్ల వారిగా రైతులకు ఇబ్బంది లేకుండా యూరియాను పంపిణి చేయాలని సోసైటీ కార్యదర్శి బల్లు హనుమంతరావుకు సూచించారు. యూరియా కొరత ఉందని రైతులు అపోహ పడవద్దన్నారు. ప్రతి రోజు సోసైటీ ద్వారా యూరియా పంపిణి జరుగుతుందని వారు తెలిపారు. యూరియా పంపిణిలో రైతులు సోసైటీ సిబ్బందికి, వ్యవసాయ శాఖ అధికారులకు సహకరించాలని కోరారు. వీరి వెంట సోసైటీ డైరక్టర్ డేగల ఉపేందర్ తదితరులు ఉన్నారు.
Post Views: 23






