Mahaa Daily Exclusive

  నేడు స్ధానిక ఎన్నికలపై రాజకీయ పార్టీలతో సమావేశం ..!

Share

కారేపల్లి, మహా : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి సోమవారం రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధిలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో పీ.శ్రీనివాస్‌ తెలిపారు. సింగరేణి మండలంలోని (16) ఎంపీటీసీ స్థానాల కు సంబంధించి అన్ని గ్రామపంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌ కార్యాలయం నోటీసు బోర్డులపై డ్రాఫ్ట్‌ ఓటర్ల జాబితా, డ్రాఫ్ట్‌ పోలింగ్‌ కేంద్రాల జాబితా ప్రదర్శించటం జరిగిందని తెలిపారు. దీనిపై రాజయకీయ పార్టీలు, ప్రజాప్రతినిధుల సమావేశంలో చర్చించటం జరుగుతుందన్నారు. ఓటర్ల జాబితా, పోలింగ్‌ కేంద్రాల జాబితా పై అభ్యంతరాలు స్వీకరించటం జరుగుందన్నారు. తుది ఓటర్‌ జాబితా, పోలింగ్‌ కేంద్రాల జాబితా 10వ తేదిన ప్రకటించుట జరుగుతుందని తెలిపారు.

Latest