మణుగూరు, మహా :
వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. పట్టణ ప్రధాన రహదారులపై ఆదివారం సాయంత్రం నిర్వహించిన గణనాధుని నిమజ్జన ఊరేగింపు భక్తులను ఆకట్టుకుంది. వెజిటబుల్ మార్కెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఊరేగింపు ఘనంగా సాగింది. భక్తుల హర్షధ్వానాల మధ్య గణపతిని అలంకరించి ఊరేగించగా, కాళీమాత అవతారంతో పాటు వివిధ వేషధారణలతో చిన్నారులు, యువకులు అందరి దృష్టిని ఆకర్షించారు. రహదారి వెంట భక్తులు, చిన్నారులు వినాయకుడికి వీడ్కోలు పలికారు. డీజే సౌండ్స్, డప్పు వాయిద్యాల మోతతో వాతావరణం మార్మోగింది. కుర్రకారు ఊరేగింపులో చిందులేస్తూ ఉత్సాహాన్ని రెట్టింపు చేశారు. భక్తులు శోభాయాత్రలో పాల్గొని గణపతికి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం సమీపంలోని గోదావరి నదిలో గణనాధుని విగ్రహాన్ని భక్తిపూర్వకంగా నిమజ్జనం చేశారు.
Post Views: 21






