టేకులపల్లి – మహా :
జిల్లా కేంద్రంలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఫంక్షన్ హాల్ నందు రోటరీ క్లబ్ అఫ్ కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ , ప్రైవేట్ సంస్థల యందు పనిచేస్తూ ఎల్లపుడూ విద్యార్థుల ప్రగతి కోసం పాటు పడుతూ అంకితభావంతో పని చేయుచున్న ,ఉపాధ్యాయులను గుర్తించి వారిని ఘనంగా సన్మానించారు .అందులో ప్రభుత్వ ఉన్నత పాఠశాల టేకులపల్లి పనిచేస్తున్న భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులు ప్రస్తుత ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ఎం .మోహన్ రావు యొక్క ప్రతిభని ,వారు విద్యార్థులను వివిధ రంగాల పోటీ పరీక్షలలో పాల్గొనేటట్లు ప్రోత్త్సహిస్తూ వారిని జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా చేస్తున్నందుకు గానూ రోటరీ క్లబ్ అఫ్ కొత్తగూడెం వారు నేషన్ బిల్డర్ అవార్డు ఇస్తూ ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అఫ్ కొత్తగూడెం ప్రెసిడెంట్ జె .రవికుమార్ .సెక్రెటరీ ఎస్ .చలపతి రావు ,ముఖ్య అతిధి ఎస్ .వి .రామ్ ప్రసాద్ డి .జి 3150 అకాడమిక్ మోనిటరింగ్ అధికారి ఏ.నాగరాజశేఖర్ పాల్గొని వారిని అభినందించారు






