Mahaa Daily Exclusive

  తెలంగాణ పోరాట నిప్పు కణిక రావి నారాయణరెడ్డి ఆయన స్ఫూర్తితో ఎన్నో ప్రజా ఉద్యమాలు వర్ధంతి సభలో సిపిఐ నేత బాగం..!

Share

ఖమ్మం, మహా:

తెలంగాణలో పోరాట అగ్గి రగిల్చిన వారిలో సుప్రసిద్ద కమ్యూనిసు రావి నారాయణరెడ్డి ఒకరని ఆయన పోరాట నిప్పు కణిక అని సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు తెలిపారు. నిజాం నిరంకుశ నియంతృత్వ పరిపాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి బానిసలుగా బతుకుతున్న ప్రజలను చైతన్యపరిచిన ఘనుడు రావి నారాయణ రెడ్డి అన్నారు. రావి నారాయణరెడ్డి 34వ -వర్ధంతి సందర్భంగా స్థానిక గిరిప్రసాద్ భవన్ లో ఆదివారం రావి నారాయణరెడ్డి చిత్ర పటానికి పూలమాలలు వేసి సిపిఐ నాయకులు -నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి దండి సురేష్ అధ్యక్షతన జరిగిన సభలో హేమంతరావు మాట్లాడుతూ తెలంగాణలో నాటి పరిస్థితులను చూసి తెలంగాణ విముక్తి తప్ప మరో మార్గం లేదని సాయుధ పోరాటంలో రావి నారాయణరెడ్డి ముందు వరుసలో -నిలిచారన్నారు. పల్లె పల్లెలో రైతాంగ పోరాటాన్ని రగిల్చిన మహానీయుల్లో రావి నారాయణ రెడ్డి ఒకరన్నారు. భూమి విలువను తెలిపి అది దున్నే వాడి చేతిలో ఉంటేనే ఈ సమాజానికి శ్రేయస్సు అని ఆయన తెలిపారు. రాజకీయాలకు అతీతంగా యావత్ తెలంగాణ ప్రజలు -మహోన్నతుడిగా గౌరవించే రావి నారాయణరెడ్డి తన జీవిత కాలం కమ్యూనిస్టుగా జీవించారన్నారు. భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలో తొలిసారి జరిగిన ఎన్నికల్లో అప్పటి ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ కంటే అత్యథిక మెజార్టీతో గెలిచి దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టుల సత్తాను చాటారన్నారు. సాయుధ పోరాటంలో అసువులు బాసిన వారికి అండగా నిలబడడంలోనూ పోరాటంలో పాల్గొన్న వారికి పింఛన్లు -ఇప్పించడంలోనూ రావి నారాయణ రెడ్డి కృషి దాగి ఉందన్నారు. చరిత్రను సృష్టించిన ఒక మహానీయుని అడుగు జాడల్లో నడిచేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు సిద్ధం కావాలని హేమంతరావు పిలుపు నిచ్చారు. పార్టీ 100వ సంవత్సరంలోకి అడుగిడిందని వంద -సంవత్సరాల కమ్యూనిస్టు పార్టీ పోరాట చరిత్రను మననం చేసుకుంటూ భవిష్యత్తు పోరాట కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి జమ్ముల జితేందర్ రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు యర్రాబాబు, ఎస్కె జానిమియా, కొండపర్తి -గోవిందరావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోటు కళావతి, రావి శివరామకృష్ణ, మిడికంటి వెంకటరెడ్డి, తాటి వెంకటేశ్వరరావు, మేకల శ్రీనివాసరావు, సాంబశివరెడ్డి, జిల్లా నాయకులు నూనె శశిధర్, వరదా నర్సింహారావు, తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, మద్దోజు శ్రావణ్, బోడా వీరన్న, జాకీర్, సురేందర్, శ్రీనాథ్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ

తదితరులు పాల్గొన్నారు.

Latest