టేకులపల్లి – మహా :
టేకులపల్లి మండలంలో సేవాఘడ్ సేవాలాల్ మహారాజ్ గుడి ప్రాంగణంలో లో లంబాడీల ఆత్మగౌర సభ లంబాడీ జాతి సంఘ నాయకులు మేధావులు విజ్ఞులు నిర్వహించారు, సభ ముఖ్య ఉద్దేశం లంబాడీలను ఎస్టీ జాబితాలో నుంచి తీసివేయాలని సుప్రీంకోర్టులో భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, మాజీ ఎంపీ సోయం బాబురావు ఫిర్యాదు, లంబాడి జాతి పై జరుగుతున్న కుట్ర ను వారి ఎమ్మెల్యేలు పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకొని పక్షాన లంబాడీల దమ్ము చూపిస్తామంటూ రాష్ట్రవ్యాప్తంగా లంబాడీల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తా ఉన్నారు, కావున రేపు అనగా సోమవారం ఉదయం 10గంటలకు టేకులపల్లి మండల కేంద్రంలో, సేవాలాల్ మహారాజ్ మందిరము నుండి ఎమ్మార్వో ఆఫీస్ దాకా లంబాడీల ఆత్మగౌర ర్యాలీ నిర్వహిస్తున్నాం కావున లంబాడి జాతి బిడ్డలు తండాల నుండి అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో లంబాడి సంఘ నాయకులు జాతి బిడ్డలు విధిగా పాల్గొనాలి పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో
ప్రేమ చంద్ నాయక్, భూక్య లాలు నాయక్, మూడ్ హుస్సేన్ నాయక్, గుగులోత్ కిష్ణ, భూక్య లక్ష్మణ్, ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్,భూక్య దళ్ సింగ్ నాయక్, బాణోత్ రామ నాయక్,భూక్య పాపా నాయక్,భూక్య సైదులు నాయక్,భూక్య రవి రాథోడ్,బొడ పుణ్య నాయక్, తదితరులు పాల్గొన్నారు






