AP: రాజధాని అమరావతిలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ అన్నారు. ఐఏఎస్ అధికారుల టవర్లు త్వరలోనే పూర్తవుతాయని చెప్పారు. రోడ్లు, కాలువల పనులు జరుగుతున్నాయని అన్నారు. అమరావతిలో పనులు ఆగిపోయాయని, నీట మునిగిందని కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏసీ రూముల్లో కూర్చోకుండా ఇక్కడికి వచ్చి చూస్తే అసలు విషయం తెలుస్తుందన్నారు.
Post Views: 35






