ఆదిలాబాద్ మహా : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మల్ గ్రామీణ మండలం కొండాపూర్ సమీపంలోని చంద్రశేఖర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే పలు కార్యక్రమాలకు ఆయన హాజరు కానున్నారు. ఉదయం 10గంటలకు నిర్మల్ చేరుకుంటారు.10 నుండి 12 వరకు బాసరలో మధ్యాహ్నం 12నుండి 1-30 వరకు బాసర ఆర్జేయూకేటీలో పర్యటిస్తారు. 2గంటలకు సోన్ నుండి ధర్మారం వరకు వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారు.అనంతరం సోన్ జడ్పీహైస్కూల్ లోని ఆస్ట్రోల్యాబ్ ను సందర్శిస్తారు. 3 గంటలకు మున్సిపల్ కార్యాలయంలో అభివృధ్ది కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3-30 కు కొండాపూర్ లో ఫంక్షన్ హాల్ లో పలు సంక్షేమపథకాల లబ్ధిదారులతో సమావేశం,అనంతరం సాయంత్రం 4-30నుండి 6-30 వరకు నిర్మల్ ఐడీవోసీ లో అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు. రాత్రి నిర్మల్ లో బస చేసి గురువారం ఉదయం ఆదిలాబాద్ జిల్లాలోని బోథ్ నియోజక వర్గంలో పర్యటిస్తారు.






