Mahaa Daily Exclusive

  తెలుగుదేశంలో చేరికలు ..!

Share

మందమర్రి, మహా : మందమర్రి మునిసిపాలిటీ 15 వ వార్డుకు చెందిన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన 70 మంది మహిళలు టిడిపి మహిళా పట్టణ అధ్యక్షురాలు జూపాక సంధ్య ఆధ్వర్యంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీనీ వీడి స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరడపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ నాలుగు కోట్ల ప్రజలను వంచించి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ఆ కుటుంబం అంతా దోపిడీకి పాల్పడిందని విమర్శించారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమరులలో పూర్తిగా విఫలమైందని ఎద్దేవా చేశారు.
మహిళలకు 2500 రూపాయలు, పేదింటి మహిళ వివాహానికి తులం బంగారం, వికలాంగులకు, ఒంటరి మహిళలకు పెన్షన్ పెంపు,
విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని ఇలా ఎన్నో మోసపూరితమైన మాటలు చెప్పి వాటి ఎవరి పరచడంలో పూర్తిగా విఫలమైందని వాక్యానించారు.
ఇక రానున్నది నార చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేనని జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి కారం రాజు, గౌరవ అధ్యక్షురాలు ఆర్కే జయ,సామ నాగేష్, పారుపల్లి శీను, సత్యనారాయణ, లక్ష్మణ్, సామ కవిత, జ్యోతి తదితరులు సభ్యులు పాల్గొన్నారు.

Latest