Mahaa Daily Exclusive

  ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: ట్రంప్‌

Share

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల భారత్‌పై సుంకాల విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేసినప్పటికీ, ఇప్పుడు తన స్వరం మార్చారు. సోషల్‌ మీడియా వేదిక ‘ట్రూత్‌’లో ఆయన మాట్లాడుతూ.. భారత్–అమెరికా మధ్య వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. త్వరలోనే ప్రధాని మోదీతో ఈ అంశంపై మాట్లాడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చర్చలు రెండు దేశాలకు మేలును కలిగిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు

Latest