Mahaa Daily Exclusive

  ఆధునిక జర్నలిజం – కృత్రిమ మేధ పుస్త‌కాలు స్వీక‌రించిన ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ …!

Share

విజయవాడ: జర్నలిజంలో ఆధునిక సాంకేతికతను తెలుపుతూ జర్నలిస్టు స్వామి ముద్దం రాసిన ‘ఆధునిక జర్నలిజం – కృత్రిమ మేధ’, ‘AI for Young Minds’, ‘Artificial Intelligence in Modern Journalism’ అనే మూడు పుస్తకాలను ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్ స్వీకరించారు.

విజయవాడలోని మీడియా అకాడమీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆలపాటి సురేష్ కుమార్ మాట్లాడుతూ – “జర్నలిజం క్రమంగా సాంకేతికతతో మిళితమవుతోంది. కృత్రిమ మేధ వంటి ఆధునిక అంశాలపై పరిశోధన చేసి, వాటిని పుస్తకాల రూపంలో సమాజానికి అందించడం ఒక విలువైన కృషి” అని అభినందించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టులు దయ్యాల అశోక్, కడలి రాంబాబు, రాజా రమేష్ తదితరులు స్వామి ముద్దం రచనల ప్రాముఖ్యతను గుర్తుచేశారు. జర్నలిజం భవిష్యత్ దిశలో ఈ పుస్తకాలు కొత్త ఆలోచనలకు మార్గదర్శకంగా నిలుస్తాయని వారు అభిప్రాయపడ్డారు. ఆధునిక జర్నలిజం రూపును సాంకేతిక మేధతో అన్వేషిస్తూ వెలువడిన ఈ పుస్తకాలు, రేపటి తరాలకు మేల్కొలుపు లాంటి వనరుగా భావించారు.

Latest