TG: వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో యూరియా కొరతకు నిరసనగా రైతులు ధర్నాకు దిగారు. వీరికి మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మద్దతు తెలుపుతూ ధర్నాలో కూర్చున్నారు. దీంతో పెద్ద ఎత్తున రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు తరలిరావడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలో పోలీసులతో రైతులు, బీఆర్ఎస్ శ్రేణుల వాగ్వాదం జరిగి తోపులాటకు దారితీసింది. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు ఎర్రబెల్లిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు
Post Views: 28






