ఆదిలాబాద్ మహా : వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు 20 శాతం సీట్లు కేటాయించాలని ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం పోతారెడ్డి రెడ్డి అన్నారు. శుక్రవారం బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి ఆడే గజేందర్ కు యువ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందించారు.ఈ సందర్భంగా ఆడే గజేందర్ సానుకూలంగా స్పందిస్తూ.. యువకులకు పెద్ద పీట వేస్తామన్ని, స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పిస్తామని అన్నారు. యువతకు ప్రాధాన్యత ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో యువ నాయకులు ఆడే సతీష్ నాయక్, యండి సద్దాం, తుల అజయ్, అజీమ్ సుల్తాన్, చెట్లపల్లి అనిల్, గజ్జెల అశోక్, సింగారపు స్వామి తదితరులు పాల్గొన్నారు
Post Views: 76






