Mahaa Daily Exclusive

  62ల‌క్ష‌ల విలువ గ‌ల గంజాయి ప‌ట్టివేత ..!

Share

ఆదిలాబాద్ మ‌హా : జిల్లాలో గంజాయి సాగు, ర‌వాణా లేకుండా చేస్తామ‌ని గాంజా పై ఉక్కు పాదం మోపుతామ‌ని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. శుక్ర‌వారం గుడిహత్నూర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేష‌న‌ల్ మీడియాకు ఆయ‌న వివ‌రాలు వెల్ల‌డించారు. తోషం గ్రామ శివారులో అంత‌ర పంట‌గా గంజాయి మొక్కలు పండిస్తున్న విష‌యాన్ని తెలుసుకుని 627 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న‌ట్టు చెప్పారు. సాగు చేస్తున్న తండ్రీ ఇద్ద‌రు కుమారుల‌పై కేసులు న‌మోదు చేసి మర్సుకోల దేవరావును అరెస్ట్ చేసిన‌ట్టు తెలిపారు. మ‌రో ఇద్ద‌రు ప‌రారీలో ఉన్న‌ట్టు చెప్పారు. ప‌ట్టుకున్న గంజాయి విలువ‌ బహిరంగ మార్కెట్లో 62 ల‌క్ష‌ల‌కుపైగా ఉంటుద‌న్నారు. గంజాయి పండిచేవారికి ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు చేస్తామ‌న్నారు.అలాగే గంజాయి పై 8712659973 నంబర్ కి వాట్సాప్ ద్వారా సమాచారం ఇస్తే నేరుగా జిల్లా ఎస్పీకి అందించబడుతుందని తెలిపారు.సమాచారం అందించిన వారికి రివార్డులు ఇవ్వ‌డంతో వారి వివరాలు గోప్యంగా ఉంచుతామ‌ని తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 120 గంజాయి కేసులు నమోదు కాగా అందులో 40 కిలోల వరకు ఎండు గంజాయి, 600 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు, ఈ కేసులలో 240 మంది వరకు నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేసిన‌ట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ , సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి చంద్రశేఖర్, ఇచ్చోడా సీఐ బండారి రాజు, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది, సిసిఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Latest