మందమర్రి, మహా : మందమర్రి పోలీస్ స్టేషన్ యాపల్ ప్రాంతంలో నివసిస్తున్న చత్తీస్ ఘడ్ వాసి
సుకులాల్ యాదవ్ (31) అనే కూలీ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కుకు గురై మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. గత నాలుగు సంవత్సరాల క్రితం చత్తీస్ ఘడ్ కు చెందిన సుకులాల్ యాదవ్ మందమర్రిలో వచ్చి మేషన్ మేస్త్రిగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని స్థానికులు తెలిపారు. ఆదివారం ఉదయం 8.00 గంటల సమయంలో, సుకులాల్ యాదవ్ పనికి వెళ్లడానికి సిద్ధమవుతూ భోజనం చేస్తున్నారని చెప్పారు. అయితే అన్నం వేడిగా ఉండడంతో దానిని చల్లార్చుకోవడానికి కూలర్ ఆన్ చేద్దామని ప్రయత్నించగా కూలర్ స్విచ్ ఆన్ చేయగానే, అతనికి విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే కుప్పకూలాడని వారు వెల్లడించారు. ప్రమాదాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలో గల ప్రథమ చికిత్స కేంద్రానికి వెంటనే తరలించారు. కాగా అంతకుముందే సుకులాల్ యాదవ్ సోదరుడు అంతకుముందే 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడకు చేరుకొని సిపిఆర్ (కార్డియో ఫల్మానరి రీససిటేషన్) చేసినప్పటికీ ఫలితం లేకపోయింది సుకులాల్ యాదవ్ అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మందమర్రి అదనపు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.






