నిర్మల్ మహా : విద్యార్థులు విద్యతో పాటు ఆరోగ్యాన్నిపెంపొందించుకోవాలని డాక్టర్ అప్పాల కావేరి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ అప్పాల చక్రధారి తెలిపారు. ఆదివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని బాలుర గిరిజన ఆశ్రమ పాఠశాల నిర్వహించిన విద్య ఆరోగ్య అవగాహన సదస్సు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్య యొక్క ప్రాముఖ్యత, ఆవశ్యకతను విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులలో మూఢనమ్మకాలను తొలగించే విధంగా ఉదాహరణలతో సహా అవగాహన కల్పించారు. శాస్త్రీయంగా ఆలోచించి, అవగాహన కలిగే విధంగా విద్యను అభ్యసించాలని విద్యార్థులు చైతన్యవంతులు కావాలని తెలిపారు. విద్యార్థులలో చాలామందికి గోకుడు వ్యాధి ఉందిని, కొద్దిమందికి రక్త హీనత ఉందని తెలిపారు.పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు చేసి చర్మ వ్యాధులకు మందులు ఉచితంగా అందించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక నిర్మల్ జిల్లా అధ్యక్షులు నేరెళ్ల హనుమంతు , పాఠశాల ప్రధానోపాధ్యాయులు గఫర్ ,సరిత, మహేష్, యశోద , ఫౌండేషన్ సభ్యులు దీపక్, రవి, అతిక్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.






