Mahaa Daily Exclusive

  హాస్టల్లో పనిచేస్తున్న వర్కర్లల డిమాండ్ ను నెరవేర్చాలి చాలీచాలని జీతాలతో అవస్థల పాలు దీక్ష శిబిరాన్ని సందర్శించిన భూక్యా శివనాయక్ …!

Share

కారేపల్లి, మహా:కారేపల్లి మండల పరిధిలోని మేకల తండా ఆశ్రమ పాఠశాల దీక్ష మందిరంలో జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ఈ దీక్ష మందిరంలో అఖిల భారత కార్మిక సంఘం ఐ ఎఫ్ టి యు జిల్లా నాయకులు భూక్య శివ నాయక్ పాల్గొని మాట్లాడుతూ గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్లో పనిచేస్తున్న వర్కర్లను పర్మినెంట్ చేయుట జీవో 64 అమ్ములు నిలిపివేసి పాత పద్ధతిలోనే జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లించాలని మరియు పెండింగ్ వేతనాలు చెల్లించాలని గిరిజన ఆశ్రమ పాఠశాల హాస్టల్లో పనిచేస్తున్న డైలీ వేజ్ కామాటి వర్కర్లకు గత 30 సంవత్సరాలుగా పైగా జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నారు కానీ ఇప్పుడు 2021 జూన్ 15వ తేదీన బి.ఆర్.ఎస్ ప్రభుత్వం కాలంలో ఆర్థిక శాఖ విడుదల చేసిన జీవో 64 ప్రకారం వేతనాలు చెల్లించాలని మౌలిక ఆదేశాలు కల్పించారు. దాన్ని ఫలితంగా వేతనాలు బాగా తగ్గుతున్నాయి కావున జీవో 64 అమ్ములను నిలిపివేయాలని ఇప్పుడు చెల్లిస్తున్న విధంగానే జిల్లా కలెక్టర్ కనీస వేతనాల సర్కిలర్ గెజిట్ ప్రకారం విధిగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు జీవో నెంబర్ 64 తో తగ్గుతున్న వేతనాలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచవలసిన ప్రభుత్వం అందుకు విరుద్ధంగా 2021లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 64 ను కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ములు చేయుట వలన గిరిజన కార్మిక వేతనాలకు నేలకు 4వేల నుండి 15 వేల వరకు తగ్గుతున్నాయి ఫలితంగా ఖమ్మం జిల్లాలో ఒక్కొక్క వర్కర్ కు సుమారుగా 45 వేల నుండి లక్ష రూపాయల వరకు నష్టపోతున్నారు తెలంగాణ పంచాయతీ రాజ్ శాఖ మంత్రి వర్యులు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తక్షణమే స్పందించి న్యాయమైన పోరాటం చేస్తున్న హాస్టల్ కార్మికులకు తక్షణమే సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో కార్మికులు భూక్య రమేష్, బాల్ సింగ్, కృష్ణ, పద్మ, శ్రీను, శాంతి, నాగేశ్వరరావు,కౌసల్య, వెంకట్రాం,,జి పద్మ, పాల్గొన్నారు

Latest