భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం
పగిడేరు గ్రామంలోని సింగరేణి జియోథర్మల్ విద్యుత్ ప్రాజెక్టును ఆదివారం డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ కొప్పుల వెంకటేశ్వర్లు పరిశీలించారు. డైరెక్టర్ తో పాటు ఈ పర్యటనలో ఏరియా జనరల్ మేనేజర్ దుర్గం రాంచందర్, ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ సునీల్ కుమార్, జనరల్ మేనేజర్ ఎస్ఎస్ మాయల్, జనరల్ మేనేజర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. మొదటగా పగిడేరు సింగరేణి జియోథర్మల్ విద్యుత్ ప్లాంటును సందర్శించారు. ప్రస్తుతం ప్లాంట్ లో 20 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండగా, సామర్థ్యాన్ని పెంచే అవకాశాలపై సంబంధిత అధికారులతో డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ చర్చించారు. తరువాత పీకే ఓసి-2 గనిని వ్యూ పాయింట్ ద్వారా బొగ్గు ఉత్పత్తి ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా భారీ వర్షాల కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలగకుండా గనుల్లో చేరే వర్షపు నీటిని బయటకు పంపించే చర్యలు తీసుకోవాలని, అందుకు సరిపడ విద్యుత్ మోటార్లు, సదుపాయాలు నిరంతరం పర్యవేక్షణలో ఉండాలని అధికారులను ఆదేశించారు. బొగ్గు రవాణా నిరంతరాయంగా సాగేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమాల అనంతరం డైరెక్టర్ ను ఏరియా అధికారులు పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిఎం ఆర్అండ్డీ కనకయ్య, జిఎం ఎక్స్‌ప్లోరేషన్ శ్రీనివాస్, ఏజీఎం పంకజ్, డిజిఎం ఎక్స్‌ప్లోరేషన్ రాజ్‌కుమార్, డిజిఎం ఆర్అండ్డీ శ్రీనివాస్, ఏరియా ఇంజనీర్ బి శ్రీనివాస్, ఇన్‌ఛార్జి ప్లాంట్ ఆఫీసర్ వీరభద్రరావు, ఎస్ఓ టు జిఎం బి శ్రీనివాస్, జనరల్ మేనేజర్ బిఎస్ రావు, ప్రాజెక్ట్ ఇంజనీర్ పీకే ఓసి వీరభద్రుడు, పీకే ఓసి-2 మేనేజర్ సురేష్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ కె శ్రీనివాస్, ఏరియా సర్వే ఆఫీసర్ దయాకర్, సీనియర్ ఎస్టేట్ ఆఫీసర్ బబ్బుల్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.






