జూలూరుపాడు, సెప్టెంబర్ 14, (మహా): మండల పరిధి పాపకొల్లు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ రోకటి సురేష్ ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వనమా రాఘవ, లాకావత్ గిరిబాబు తో కలిసి సురేష్ కుటుంబ సభ్యులను ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా సురేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ బత్తుల వీరయ్య, సుజాతనగర్ మండల బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లావుడ్యా సత్యనారాయణ, జూలూరుపాడు మండల కాంగ్రెస్ నాయకులు రాంశెట్టి రాంబాబు, పాపిన్ని జనార్ధన్, సొసైటీ డైరెక్టర్ పాపిన్ని వెంకయ్య, మద్దిశెట్టి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 22






