ఖమ్మం, మహా:
ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగ ఉపాధ్యాయులకు పదవి విరమణ అనంతరం వచ్చే బెన్ఫిట్స్ను వెంటనే చెల్లించాలని ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల జేఏసి నాయకులు డిమాండ్ చేశారు. జేఏసి సమావేశం ఆదివారం రిక్కాబజార్ హైస్కూల్లో సింగారపు -జయరాం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నేతలు మాట్లాడుతూ మార్చి 2024 నుండి ఉద్యోగ విరమణ పొందిన వారికి -రావాల్సిన రిటైర్మెంట్ బెన్ఫిట్స్ కమిటేషన్, గ్రాట్యూటి, న్యూ శాలరీ, జిఐఎస్, ఈఎల్ ఎన్ క్యాష్మెంట్స్, పిఆర్సి ఏరియర్స్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రతినెల రూ.700 కోట్లు పెండింగ్ బిల్లులకు చెల్లిస్తుందని వాటిలో ఉద్యోగ విరమణ పొందిన వారికి ప్రత్యేక కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే దశల వారీగా ఆందోళనకు సిద్దమవుతామని వారు తెలిపారు. ఈ సమావేశంలో రాంచందర్రావు, శాంతయ్య, ఆదినారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






