Mahaa Daily Exclusive

  మండలం లో కందాళ విస్త్రుత పర్యటన..!

Share

నేలకొండపల్లి, సెప్టెంబర్ 4 మహా :

పాలేరు మాజీ శాసనసభ్యులు కందాళ ఉపేందర్ రెడ్డి ఆదివారం విస్త్రుతంగా పర్యటించారు. మండలం లోని పైనంపల్లి లో పలువురు కుటుంబాలను సందర్శించారు. చిన్నారులను ఆశ్వీరదించారు. అనంతరం స్థానిక రైతులతో మాట్లాడారు.. యూరియా అందుతుందా లేదా, పలు స్థానిక సమస్యల పై ఆరా తీశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోరకు నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వున్నం బ్రహ్మయ్య, పైనంపల్లి సోసైటీ చైర్మన్ నాగుబండి శ్రీనివాసరావు, నాయకులు కమదన ప్రవీణ్, శాఖమూరి సతీష్, మరికంటి రేణుబాబు, అనగాని నరసింహారావు, మాదాసు ఆదాం తదితరులు పాల్గొన్నారు.

Latest