నేలకొండపల్లి, సెప్టెంబర్ 14 మహా :
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పధకాల గురించి ప్రజలకు వివరించేందుకు విస్త్రుతంగా ప్రచారం చేయాలని నేలకొండపల్లి బీజెపీ మండలాధ్యక్షుడు పాగర్తి సుధాకర్ సూచించారు. మండలం లోని చెరువుమాధారం లో ఆదివారం బూత్ స్థాయి కమిటి సమావేశం ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు…పేద ప్రజలకు అన్ని వర్గాల వారికి అనేక సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టారని పేర్కోన్నారు. ప్రతీ బూత్ స్థాయి లో తప్పకుండా ప్రజలకు వివరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని సూచించారు. ఈ నెల 17. న ప్రధాని మోడీ పుట్టిన రోజు వేడుకలను వాడ, వాడ లో ఘనంగా ‘నిర్వహించాలని సూచించారు. పార్టీ అధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయి గోవిందరావు, సయ్యద్ మోహినుద్దీన్, గెల్లా నాగసాయి, కొండా హర్షవర్ధన్, గెల్లా గిరి, గెల్లా ప్రవీణ్, నాగార్జున, తేజావత్ శ్రీనివాస్, కొండా ధనమూర్తి తదితరులు పాల్గొన్నారు.






